Saturday, 4 June 2016
నకిలీ విలేకరిపై కేసు నమోదు
కొత్తగూడెం క్రైం, జూన్ 4: విలేకరి నని చెప్పి, స్వీట్‌షాపు వ్యాపారిని బేధిరించి డబ్బులు వసూలు చేసిన యువకుడిపై త్రీ టౌన్ పోలీసులు కేసు నమో దు చేశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. కూలీలైన్‌కు చెందిన ఎండీ సుభాని గురువారం లక్ష్మీదేవిపల్లిలోని దుర్గా స్వీట్స్ దుకా ణా నికి వెళ్లి అక్కడ స్వీట్స్ తీసుకున్నాడు. సదరు దుకాణం యజమాని తీసుకున్న స్వీట్స్‌కు డబ్బులు చెల్లించమని అడుగగా తాను ప్రముఖ పత్రిక విలేకరి నని చెప్పి బేధిరించి, రూ. 200 విలువచేసే స్వీట్స్ తో పాటు, రూ.800 అదనంగా వసూలు చేశాడు. అయితే నకిలీ విలేకరి బెడద ఎక్కువవడంతో ఈ విషయ మై సదరు స్వీట్‌షాపు యజమాని శుక్రవా రం రాత్రి త్రీ టౌన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యా దు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment