Saturday, 4 June 2016
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
-రూపాయికే నల్లా కనెక్షన్ దరఖాస్తుల స్వీకరణ
-హాజరైన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మేయర్
ఖమ్మం సిటీ, జూన్ 4: ఖమ్మం నగరంలోని పలు అభివృద్ధి పనులకు ప్రజాప్రతినిధులు శనివారం శంకుస్థాపన చేశారు. ముందుగా 11వ డివిజన్ మాణిక్యనగర్ కబేళా ప్రాంతంలో, 21వ డివిజన్ వైరారోడ్డు ఆంజనేయస్వామి టెంపుల్ సమీపంలో సుమారు రూ.30 లక్షలతో చేపట్టనున్న రోడ్లు, డ్రైన్ల పనులకు మేయర్ డాక్టర్ గుగులోత్ పాపాలాల్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి , ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ శంకుస్థాపన చేశారు. అదేవిధంగా సీక్వెల్ సమీపంలోని డ్రైన్‌లలో సిల్టు తీసే పనులను పరిశీలించారు.
5వ డివిజన్ పాత ఖానాపురంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూపాయికే పంపు కనెక్షన్ పథకాన్ని ప్రారంభించి బీపీఎల్ కుటుంబాల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఖమ్మం నగరంలో ప్రతి రోజూ తాగునీరు సరఫరా చేస్తామన్నారు. ప్రభుత్వం ప్రకటించిన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నగరంలో నిర్మించే రోడ్లు, డ్రైన్లు నాణ్యంగా ఉండాలని కాంట్రాక్టర్లకు సూచించారు.
త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. కేఎంసీ డిప్యూటీ మేయర్ బత్తుల మురళీప్రసాదరావు, కార్పొరేటర్లు నాగండ్ల కోటేశ్వరరావు, పగడాల నాగరాజు, కర్నాటి కృష్ణ, ప్రశాంతలక్ష్మి, చావా నారాయణరావు, మచ్చా రవీందర్, మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి, ఎంబీ అంజనేయప్రసాద్, డీఈలు స్వరూపరాణి, వెంకటేశ్వర్లు, ఏఈ ధరణికుమార్, పరుచూరి సత్యనారాయణ, అరవింద్, పొదిల నారాయణ, వాసు, నెల్లూరి చంద్రయ్య, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment