► నేటి పోటీ ప్రపంచంలో నెగ్గుకురావాలంటే ఇంగ్లిష్ తప్పనిసరని వ్యాఖ్య
► అందుకే ఆర్థిక భారమైనా ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నామని వెల్లడి
► ఇంగ్లిష్ బోధనకు సిద్ధంగా ఉన్నామంటున్న ప్రభుత్వ టీచర్లు
► అయినా ముందుకుపడని సర్కారు అడుగులు
► ఏటా వేల కోట్లు వెచ్చిస్తున్నా ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గుతున్న విద్యార్థులు
హైదరాబాద్/నెట్‌వర్క్
సర్కారు బడుల్లో చక్కని వసతులు కల్పించి, నేటి అవసరాలకు తగ్గట్టుగా ఆంగ్ల బోధన ప్రవేశపెడితే తమ పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్లకే పంపుతామని తల్లిదండ్రులంతా చెబుతున్నారు. కూలి పనులకు వెళ్లేవారు సైతం తమ పిల్లలకు ఇంగ్లిష్ మీడియం కావాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వానికి మాత్రం వీరి ఆకాంక్షలు పట్టడం లేదు. వారి ఆలోచనలకు అనుగుణంగా అడుగులు వేయడం లేదు. దీంతో మరో మార్గం లేక పేద, మధ్య తరగతివారు సైతం ప్రైవేటు వైపు చూస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏటా 50 వేల నుంచి లక్షన్నర వరకు పడిపోతోంది. ఈ పరిస్థితుల్లో సర్కారు బడిని బతికించుకోవాలంటే విద్యార్థులు, తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా విద్యను అందించాల్సిందేనని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. టీచర్లూ అదే మాట అంటున్నారు. తాము ఇంగ్లిషు మీడియంలో బోధించేందుకు సిద్ధంగా ఉన్నామని, తరగతికి ఒక టీచర్‌ను ఇచ్చి, శిక్షణ ఇస్తే తప్పకుండా బోధిస్తామని స్పష్టం చేస్తున్నారు.
4 ఏళ్లలో 2.83 లక్షలు తగ్గిన విద్యార్థుల సంఖ్య
తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ స్కూళ్లు మారకపోవడంతో అందులో చదివే విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గుతోంది. 2011-12 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 30,76,352 మంది విద్యార్థులు ఉంటే.. అది 2015-16 నాటికి ఆ సంఖ్య 27,92,514కు పడిపోయింది. అంటే 2,83,838 మంది తగ్గిపోయారు. అదే సమయంలో ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2011లో ప్రైవేటు పాఠశాలల్లో 30,64,343 మంది విద్యార్థులు ఉండగా 2015-16 విద్యా సంవత్సరం వచ్చే సరికి అది 32,70,799కి పెరిగింది. అంటే 2 లక్షలకు పైగా విద్యార్థుల ప్రైవేటు స్కూళ్లల్లో పెరిగారు. మిగతావారు డ్రాపవుట్స్‌గా మిగిలిపోయారు.
ఒక్కో విద్యార్థిపై రూ.37 వేల ఖర్చు.. అయినా..
ప్రభుత్వ పాఠశాలల్లో 27,92,514 మంది విద్యార్థులు.. 1.23 లక్షల మంది ఉపాధ్యాయులు.. ఏటా రూ.10 వేల కోట్లకు పైగా బడ్జెట్.. ఒక్కో విద్యార్థిపై ఏటా వెచ్చిస్తున్న మొత్తం రూ.35,810. అయినా ప్రభుత్వ పాఠశాలల్లో ఆశించిన ఫలితాలు రావడం లేదు. విద్యార్థులకు చదువు ఫలాలు దక్కడం లేదు. 46 శాతం మంది తెలుగులోనూ సరిగ్గా చదవలేకపోతున్నారు.. ఎయిడెడ్ , రెసిడెన్షియల్ పాఠశాలలు మినహా మిగతా ప్రభుత్వ స్కూళ్లు, వాటిల్లో చదివే విద్యార్థుల పరిస్థితి. సుశిక్షతులైన టీచర్లు ఉన్నా ప్రైవేటు పోటీని అధిగమించలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఉపాధ్యాయుల వేతనాల కోసమే రూ. 7,711 కోట్లు ప్రణాళికేతర వ్యయం కింద ఏటా వెచ్చిస్తున్నా ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు తప్పడం లేదు. ఉపాధ్యాయుల వేతనంగానే ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం ఏటా రూ. 31,969 ఖర్చు చేస్తోంది. ఇక వివిధ పథకాల కింద రూ. 1,343 కోట్లు వెచ్చిస్తోంది. ఇందులోనూ ఒక్కో విద్యార్థిపై రూ. 5,570 ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఇలా మొత్తంగా ఒక్క విద్యార్థిపైనే ఏటా రూ. 37,538 వెచ్చిస్తున్నా ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నామని విద్యాశాఖ నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. ఇందుకు కారణాలు అన్వేషించి పకడ్బందీ చర్యలు చేపట్టడంతో విద్యాశాఖ విఫలం అవుతోంది. ఫలితంగా సర్కారు బడికి క్రమంగా ఆదరణ తగ్గుతోంది.
గత ఐదేళ్లలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల పరిస్థితి
సంవత్సరం ప్రభుత్వ ప్రైవేటు
2011-12 30,76,352 30,64,343
2012-13 29,71,460 30,19,797
2013-14 29,50,739 30,64,088
2014-15 28,39,735 31,14,641
2015-16 27,92,514 32,70,799.
ప్రైవేటు పాఠశాలలకు పెరుగుతున్న ఆదరణ
జిల్లా కేంద్రాల పల్లెలకు విస్తరిస్తున్న ప్రైవేటు పాఠశాలలకు ఆదరణ పెరుగుతోంది. సర్కారు బడుల కంటే కాస్త మెరుగైన వసతులు కల్పిస్తూ ఇంగ్లిష్ మీడియం చదువులతో దిగువ మధ్యతరగతినీ ఆకర్షిస్తున్నాయి. తమ పిల్లలను కూడా ఇంగ్లిష్ మీడియం చదువులు చదివించాలనే కోరిక గ్రామీణ ప్రాంత తల్లిదండ్రుల్లోనూ బలంగా నాటుకుపోయింది. ఎన్ని కష్టాలకోర్చయినా ఫీజుల భారాన్ని మోస్తూ ప్రైవేటు పాఠశాలలకు పంపుతున్నారు. నాలుగు ఇంగ్లిష్ ముక్కలొస్తే పైచదువులు చదివి మంచి ఉద్యోగాల్లో స్థిపడతారనే విశ్వాసం వారిలో పెరుగుతుండడం ప్రైవేటు స్కూళ్లకు వరంగా మారుతోంది. కానీ ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెడితే మా పిల్లలను ఎందుకు ప్రైవేటు స్కూళ్లకు పంపుతామని పేద తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
ఇంగ్లిషు మీడియం ప్రారంభిస్తే బాగుండు
గవర్నమెంటు బళ్లలో ఇంగ్లీష్ సక్కగ చెప్తలేరు. ఈ రోజుల్లో ఎక్కడ చూసిన ఇంగ్లీష్ నడుత్తుంది. రేపు పిల్లలకు సర్కారు కొలువులు, ఇతర కొలువులు రావాలంటే ఇంగ్లీష్‌లో మాట్లాడుడు రావాలని అంటున్నారు. దీంతో పిల్లలను ప్రైవేటు బళ్లకు పంపిత్తున్నాం. గవర్నమెంటు బళ్లలో ఇంగ్లీష్ చెబితే బాగుండు.
-దామెర సమ్మయ్య , విద్యార్థి తండ్రి కాచన్‌పల్లి ఆదిలాబాద్
ఇంగ్లిషు నేర్పించాలన్న తపనతోనే ప్రైవేట్‌బడిలో చేర్పించా
మాకు ఇద్దరు ఆడపిల్లలు. ఇంగ్లీష్ విద్య నేర్పించాలన్నదే మా తపన. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ విద్యను బోధించడం లేదు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీషు మీడయం పెట్టడం లేదు. ఆర్థికంగా భారమైనా భరిస్తూనే మా పిల్లలు ఇద్దరిని ప్రైవేటు స్కూళ్లో చదివిస్తున్నాం.
- పరికిపండ్ల కృష్ణ, తండ్రి, ఆదిలాబాద్
ఫ్రీ ప్రై మరీ సెక్షన్ష్ పెట్టాలి
ప్రభుత్వ పాఠశాలలో కూడా ఫ్రీ ప్రై మరీ సెక్షన్ష్ ఏర్పాటు చేయాలి. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీని ప్రవేశ పెట్టాలి. అలాగే పాఠశాలలో 5వ తరగతి వరకు ప్రత్యేకంగా ఇంగ్లీష్ బోదించే ఏర్పాట్లు చే యాలి. సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయున్ని కచ్చితంగా నియమించాలి. అప్పుడే పిల్లలను వారి తల్లిదండ్రులు ప్రయివేటు పాఠశాలలకు మాన్పించి ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తారు. పాఠశాలలు మెరుగు పడుతాయి.
-జోడు మధుకర్, హెచ్‌ఎం. కాచన్‌పల్లి పాఠశాల
మా పిల్లలకైనా మంచి చదువులు అందించాలనే!
మా బతుకేదో మేం బతుకుతున్నాం.. మా పిల్లలైనా మంచిగా చదువుకోవాలి. అందుకోసమే ఇంగ్లీష్ మీడియం బడిలో చేర్పించాల్సి వస్తుంది. అదే ప్రభుత్వ బడిలో ఇంగ్లీష్ మీడియం చెపితే.. ప్రై వేట్‌కు ఎందుకు పంపిస్తాం.. ఎల్‌కేజీ,యూకేజీ నుండే ఇంగ్లీష్ మీడియం చెప్పాలి. పైపైన పాఠాలు చెప్పకుండా శ్రద్దపెట్టి చెబితే... డబ్బులు పెట్టి ప్రై వేట్ స్కూల్‌కు పంపకుండా ఉంటాం.. నమ్మకం కలిగేలా పాఠాలు చెప్పాలి
- ధనలక్ష్మీ, విద్యార్థి తల్లి, వైరా, ఖమ్మం జిల్లా
సర్కార్ బడి అంటే నమ్మకం పోతుంది
గాజుల రంగయ్య, ఖమ్మం
ప్రభుత్వ బళ్లలో ఇంగ్లీష్ మీడియం చెబితే డబ్బులు పెట్ట ఎందుకు ప్రై వేట్ బడికి పంపుతాం. అయితే ప్రభుత్వ బడి అంటే సారు ఇట్టా వచ్చి అట్టా పోతాడు అనే మాట ఉంది. అందుకు అలాగే ఉండరు కానీ.. బడి తప్పించే సార్లపై అధికారులు నిఘా పెట్టాలి. ప్రభుత్వ బడి సార్‌కు చదువు వస్తది కానీ వాళ్లకు వ్యాపారాలు ఉంటాయి. బడికి సరిగ్గా రారు. వచ్చినా పాఠాలు చెప్పరు.
ప్రత్యేక శిక్షణ, మెటీరియల్ ఇవ్వాలి
ఇంగ్లీష్ మీడియం బోధించేందుకు మేం సిద్దంగానే ఉన్నాం. అయితే ఇందుకోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి, మెటీరియల్ సరఫరా చేయాలి, ప్రతీ ఒక్కరు తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పించాలని చూస్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో కేజీ నుండే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలి, అందుకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాలి, ఇంగ్లీష్ బోధనకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి.
శ్రీనివాస్, ఈశ్వరమాదారం పాఠశాల స్కూల్ అసిస్టెంట్, ఖమ్మం
ఆంగ్ల బోధన లేకపోవడం వల్లే ప్రైవేటుపై మొగ్గు
ప్రాథమిక స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్యాబోధన లేకపోవడం వల్లే మా పిల్లలను ప్రై వేటు పాఠశాలలవైపు పంపిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆంగ్లబోధన ఉంటే పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించేవాళ్లం. ప్రై వేటు పాఠశాలల్లో పిల్లలపై శ్రద్ధ చూపుతారన్న నమ్మకం ఏర్పడటం వల్ల ప్రైవేటు వైపు మొగ్గుచూపుతున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆ విధంగా చర్యలు చేపడితే ప్రైవేటుకు ఎందుకు పంపుతం?
విద్యార్థి తల్లి రజిని, నాగర్‌కర్నూల్.
ఇంగ్లీషు మీడియం ప్రారంభించాల్సిందే
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం ప్రారంభించాలి. ఆ దిశగా చర్యలు చేపట్టాలి. ఇందుకు ఉపాధ్యాయ సంఘాలు సహకరిస్తాయి. టీచర్లకు ఇంగ్లిషు బోధనలో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక టీచర్ కచ్చితంగా ఉండేలా చూడాలి. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్‌ను ఇవ్వాలి. అప్పుడే ప్రైవేటు స్కూళ్లకు పంపించకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తారు.
- సరోత్తంరెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, పీఆర్‌టీయ-టీఎస్, పీఆర్‌టీయూ-తెలంగాణ అధ్యక్షులు

No comments:
Post a Comment