Wednesday, 1 June 2016

సత్తుపల్లి నియోజకవర్గాన్ని నెం.1చేయడమే లక్ష్యం

  మిషన్ కాకతీయతో జిల్లా సస్యశ్యామలం 
-అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి తుమ్మల
సత్తుపల్లి, నమస్తే తెలంగాణ, జూన్ 1 : తెలుగు రాష్ర్టాల్లో తనకు రాజకీయ బిక్షపెట్టిన సత్తుపల్లి నియోజకవర్గాన్ని నెం.1గా నిలపడమే తన లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం మండలంలోని తుంబూరులో ఆనకట్ట కెనాల్‌కు రూ.2.75కోట్లు, గోడౌన్ నిర్మాణానికి రూ.40లక్షలు, సత్తుపల్లి పట్టణ శివార్లలోని తామర చెరువు ఆధునికీకరణకు రూ.2.95 లక్షల నిధులు కేటాయించగా ఆ పనుల ప్రారంభానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మిషన్ కాకతీయలో భాగంగా ఫేజ్-1లో జిల్లా లో 839 చెరువులకు గాను 801 చెరువుల పనుల పూర్తి చేశామని, ఫేజ్-2లో 927 చెరువులకు గాను 908 చెరువుల పనులు మొదలుపెట్టామన్నారు.

సత్తుపల్లి పట్టణంలోని తామ ర చెరువును సుందరంగా తీర్చిదిద్ది ఆహ్లాదకరంగా ఉండేలా చేస్తామన్నా రు. సీతారామ ప్రాజెక్టు ద్వారా లింక ప్ చేసి ఈ చెరువులో నీటిని స్థిరీకరించేలా చర్యలు చేపడతామన్నారు. పట్టణ ప్రజలు సాయంత్రం వేళల్లో సేద తీరేందుకు ట్యాంక్‌బండ్ తరహా లో తయారుచేస్తామని తెలిపారు. పనులు కూడా రైతులు దగ్గరుండి చేయించుకుంటూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలన్నారు. వర్షాకాలం దగ్గర పడుతున్న దృష్ట్యా మిషన్ కాకతీయ పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు. మిషన్ కాకతీయలో ఇప్పటికే ఖమ్మం జిల్లా, సత్తుపల్లి నియోజకవర్గం రాష్ట్రంలో నెంబ ర్ 1 స్థానంలో ఉన్నాయని, మిగిలిన అభివృద్ధి పనుల్లో కూడా ఇదే తరహా లో పనులు ఉండాలన్నారు.

సత్తుపల్లి నుంచే జాతీయ రహదారి వెళ్తుందని, దీనికి ప్రజలందరూ సహకరించాలన్నారు. రైతులు తారురోడ్లపై కేజీ వీ ల్స్ నడపవద్దంటూ హెచ్చరించారు. మిషన్ భగీరథ ద్వారా రాబోయే ఏడాది లోగా అన్ని గ్రామాలకు మంచినీటిని అందించే లక్ష్యంతో పనులు చేస్తున్నామన్నారు. హారితహారంలో భాగంగా వర్షాకాలం ప్రారం భం కాగానే రోడ్ల వెంట విరివిగా చెట్లు నాటాలని ఎంపీడీవోలను ఆదేశించారు. వర్షాకాలం సీజన్ దగ్గరకు వస్తున్న దృష్ట్యా వ్యవసాయాధికారు లు రైతులకు అవసరమైన ఎరువులు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.

కార్యక్రమంలో జడ్పీ సీఈ వో మారుపాక నగేష్, డీఎఫ్‌వో, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్‌డీ బేగ్, ఎంపీపీ జ్యేష్ట అప్పారావు, నగరపంచాయతీ ఛైర్‌పర్సన్ దొడ్డాకుల స్వాతి గోపాలరావు, వైస్ ఛైర్మన్ కొత్తూరు ఉమమహేశ్వరరావు, తహసీల్దార్ పుల్లయ్య, ఎంపీడీవో రవి, టీఆర్‌ఎస్ నాయకులు చల్లగుళ్ల నర్సింహారావు, చల్లగుళ్ల కృష్ణయ్య, గాదె సత్యం, చలసాని సాంబశివరావు, వెల్ది జగన్మోహన్‌రావు, దమ్మపేట మండల నాయకులు పైడి వెంకటేశ్వరరావు, పెనుబల్లి మండల నాయకులు చెక్కిలాల లక్ష్మణరావు (పటేల్), కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment