Wednesday, 1 June 2016

సంక్షేమంలో తెలంగాణ ఆదర్శం

  తల్లాడ, జూన్ 1 : సంక్షేమ రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, జడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత అన్నారు. బుధవారం మండలంలోని లక్ష్మీపురంలో టీఆర్‌ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా జరిగిన సభలో వారు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసి అశువులు బాసిన అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు, తెలంగాణ పోరాటంలో పాల్గొన్న కళాకారులకు ఉద్యోగాలు కల్పించి ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఔదర్యాన్ని చాటుకున్నారన్నారు. 

మండల కేంద్రంలో డబుల్ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ముద్దునూరు, లక్ష్మీపురం రోడ్డు మంజూరుకు కృషి చేస్తానని వారు హామీ ఇచ్చారు. సర్పంచ్ జంగా సత్యనారాయణరెడ్డి, ఎంపీపీ సరికొండ లక్ష్మీపద్మావతి, జడ్పీటీసీ మూకర ప్రసాద్, ఎంపీటీసీ పిల్లి కృష్ణ, దుండేటి వీరారెడ్డి, రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, యరమల వెంకటేశ్వరరెడ్డి, అన్నెం వెంకటేశ్వరరెడ్డి, దుగ్గిదేవర వెంకట్‌లాల్, వేమిరెడ్డి కృష్ణారెడ్డి, దుండేటి కేశవరెడ్డి, బొగ్గుల కృష్ణారెడ్డి, కట్టా కృష్ణార్జునరావు పాల్గొన్నారు.

No comments:

Post a Comment