Wednesday, 1 June 2016

   అద్వితీయ సంబురాలు 
    కార్యాలయాల్లో వెలుగులు 
   జడ్పీలో అర్థరాత్రి వరకు ఉద్యోగుల సందడి 
   
నేడు ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు 


    త్యాగాల పునాదులపై అరవై ఏళ్ల తెలంగాణ కల సాకారమై నేటికి రెండేళ్లు పూర్తవుతున్నాయి...2014 జూన్‌ 2 తెలంగాణ జనం స్వేచ్ఛా వాయువు పీల్చుకుని తలెత్తుకుని నిలిచిన క్షణం... మదిలో పులకించిన మధుర క్షణం... కల సాకారమయ్యాక రెండేళ్ల సంబురాలకు సిద్ధమయ్యారు... అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందడి జిల్లాలో కొన్ని చోట్ల ముందే ఆరంభమైంది... ఆయా శాఖల ఉద్యోగులు ఆటల పోటీలతో అలరించారు. జడ్పీ ఉద్యోగులు బుధవారం రాత్రి నగరంలో పలు కార్యక్రమాలతో తెలం‘గానం’ వినిపించారు. సర్దార్‌పటేల్‌ స్టేడియంలో జరిగే అధికారిక కార్యక్రమాల్లో మంత్రి తుమ్మల పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొంటారు.

    No comments:

    Post a Comment