-రామకృష్ణ కుటుంబానికి దక్కనున్న ఉద్యోగం
-కొడుకు లేని లోటును కేసీఆర్ తీర్చారు-అమరుని తల్లి తిరుపతమ్మ
రఘునాథపాలెం, మే 31 : తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న అమరుల త్యాగం వృథా కాలేదు. సీమాంధ్రుల కుట్రలను తిప్పికొట్టేందుకు వారు చేసిన ప్రాణత్యాగం ఫలించింది. అది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే రుజువైంది. అంతేకాదు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం బతుకులు బాగుపడుతాయనుకున్న నాలుగుకోట్ల ప్రజల ఆకాంక్షలు ఒక్కొక్కటిగా నెరవేరుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టిన అనతికాలంలోనే అమరుల కుటుంబాలకు రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఒక్కొక్కటి ఇచ్చి కొండంత అండగా నిలుస్తోంది.
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆత్మ బలిదానాలు చేసుకున్న ఆమరుల కుటుంబాలకు కేసీఆర్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతను ఇచ్చి బాసటగా నిలిచి భరోసా ఇచ్చింది. తొలి విడతగా గతేడాది అమరుని కుటుంబానికి రూ.10లక్షలను అందజేసి కొడుకుల్లేని లోటును తీర్చింది. అదే క్రమంలో రాష్ట్ర 2వ ఆవిర్భావ వేడుకల్లో అమరుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి శాశ్విత పరిష్కారం చూపనుంది.
No comments:
Post a Comment