Friday, 3 June 2016

సీఎం కేసీఆర్ సమక్షంలో భారీగా చేరికలు;
గులాబీ తీర్థం పుచ్చుకున్న వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు 
-హాజరైన మంత్రులు తుమ్మల, ఈటల, ఎంపీ పొంగులేటి, ఎమ్మెల్యేలు పువ్వాడ, జలగం
-రాబోయే రోజుల్లో ప్రతి ఎకరాకు సాగునీరు.. ప్రతి ఇంటికీ తాగునీరు..
-చేరికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి
(నమస్తే తెలంగాణ, ఖమ్మం ప్రతినిధి);ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ సీఎం గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లా అభివృద్ధికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని, రాబోయే రోజుల్లో జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు, ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, జలగం వెంకటరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో శుక్రవారం హైదరాబాద్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని పలు పార్టీలకు చెందిన 200 కుటుంబాలు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నాయి. వారందరికీ సీఎం కేసీఆర్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లా అభివృద్ధికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. 

ముఖ్యంగా కరువు ప్రాంతమైన ఖమ్మం పట్ల గత ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించాయని, ఫలితంగా జిల్లా అభివృద్ధికి ఆమడదూరంలో ఉందని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే జిల్లాకు పలు ప్రాజెక్టులను మంజూరు చేసి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ప్రణాళిక రూపొందించిందని గుర్తుచేశారు. మూడేళ్లలో సాగునీరు, తాగునీరు అందించేందుకు శాయశక్తులా కృషిచేస్తామని హామీ ఇచ్చారు. 

జిల్లా అభివృద్ధి పట్ల ఎంపీ పొంగులేటి చూపుతున్న శ్రద్ధను సీఎం అభినందించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, జలగం వెంకటరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు లింగాల కమల్‌రాజ్, బొర్రా రాజశేఖర్ తదితరులున్నారు. టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో కాంగ్రెస్‌కు చెందిన మధిర జడ్పీటీసీ మూడ్ ప్రియాంక, సీపీఐకి చెందిన చింతకాని ఎంపీపీ దాసరి సామ్రాజ్యం, కాంగ్రెస్‌కు చెందిన కారేపల్లి ఎంపీపీ పద్మావతి, మధిరకు చెందిన టీడీపీ కౌన్సిలర్ వినయ్‌కుమార్, మధిర మండలం బయ్యారం సీపీఎం ఎంపీటీసీ గుంజ ఉషారాణి, దెందుకూరు టీడీపీ ఎంపీటీసీ షేక్ బేగం, బోనకల్ మండలం చిరునోముల సీపీఎం ఎంపీటీసీ బొడ్డు శ్రీలత, చింతకాని మండలం రామకృష్ణాపురం సీపీఐ ఎంపీటీసీ సకినాల కృష్ణవేణి, ఏన్కూర్ మండలం తిమ్మారావుపేట టీడీపీ ఎంపీటీసీ భూక్యా లాలమ్మ, బోనకల్ మండలం చొప్పకట్లపాలెం కాంగ్రెస్ సర్పంచ్ శ్రీలక్ష్మి, చింతకాని మండలం జగన్నాథపురం సీపీఎం సర్పంచ్ కనకమహాలక్ష్మి, కారేపల్లి మండలం కమలాపురం టీడీపీ సర్పంచ్ భూక్యా శ్రీనివాస్, దుబ్బతండా టీడీపీ సర్పంచ్ భూక్యా మట్రూ, మాదారం కాంగ్రెస్ సర్పంచ్ మంగీలాల్, కొణిజర్ల మండలం లాలాపురం టీడీపీ సర్పంచ్ షేక్ సైదా, ఏన్కూర్ మండలం తిమ్మారావుపేట టీడీపీ సర్పంచ్ మంగీలాల్, జూలూరుపాడు మండలం మాచనపేట కాంగ్రెస్ సర్పంచ్ సపావత్ దేవి, చింతకాని మండలం పాతర్లపాడు కాంగ్రెస్‌కు చెందిన సొసైటీ డైరెక్టర్లు తాళ్లూరి అపర్ణ, అమరబోయిన కృష్ణయ్య, జూలూరుపాడు కాంగ్రెస్ సొసైటీ డైరెక్టర్లు దుద్దుకూరి నాగేశ్వరరావు, చెవుల కృష్ఠాణరావు, గుగులోత్ భీమాతోపాటు జూలూరుపాడు కాంగ్రెస్ నాయకులు లేళ్ల వెంకటరెడ్డి, బాణోతు లాలు, ఉప్పాల నర్సింహారావు, బాణోతు బకీరా, ఎండపల్లి చిట్టిబాబు, బాణోతు రాములు, తోట శ్రీనివాసరావు, గుగులోత్ హరి, సామినేని అప్పారావు, సీపీఎం సీతంపేట కార్యదర్శి పానకాలు, నామవరం సీపీఎం కార్యదర్శి రామ్మూర్తి, బోనకల్ మండలం చిరునోముల సీపీఎం మాజీ ఎంపీటీసీ ఖానాలు టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో ఉన్నారు.

No comments:

Post a Comment