Wednesday, 1 June 2016

వంద మంది సివిల్ కానిస్టేబుళ్ల బదిలీ..

 ఖమ్మం క్రైం, మే 31: జిల్లాలోని మైదాన ప్రాంత పోలీస్ స్టేషన్లలో ఐదేళ్లుగా విధులు నిర్వహిస్తున్న 100 మంది సివిల్ కానిస్టేబుళ్లకు మంగళవారం ఎస్పీ షానవాజ్ ఖాసీం కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు నిర్వహించారు. ఎస్బీ కాన్ఫిరెన్స్‌హాల్‌లో జరిగిన కానిస్టేబుళ్ల కౌన్సెలింగ్ ప్రక్రియలో ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారికి మండలం, ఏజెన్సీ ప్రాంతాల్లోని వారు ఎంపిక చేసుకున్న స్టేషన్లకు బదిలీ చేశా రు. ఖాళీలను బట్టి పోస్టింగ్‌లు కల్పించారు. పిల్ల ల చదువులను దృష్టిలో ఉంచుకొని మే నెలలోనే పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. సిబ్బంది కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికృష్ణ, ఎస్బీ డీఎస్పీ అశోక్ కుమార్, సెక్షన్ సూపరింటెండెంట్ జయరాజ్ పాల్గొన్నారు.

No comments:

Post a Comment