వ్యాట్ ట్యాక్స్‌ను 5కు తగ్గించాలి
 కేంద్ర ప్రభుత్వం వ్యాట్ ట్యాక్స్‌ను 5కు తగ్గించాలి. బ్యాంకు రుణాలను రిషెడ్యూల్ చేయాలి. చార్జీలు పచ్చిబియ్యానికి రూ. 75, బాయిల్డ్ రైస్‌కు రూ. 100లకు పెంచాలి. ఇవ్వాల్సిన 67 బదులు 65 కేజీలకు తగ్గించాలి. కేంద్ర ప్రభుత్వం కాస్ట్‌సీట్‌లో ఉన్నా 1శాతం స్టోరేజీను మిల్లర్లకు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం పరిధి కాకపోయినా మిల్లర్లు ఎదుర్కొంటున్న పరిస్థితిని చూసి రూ. 15లకు ఉన్న మిల్లింగ్ చార్జీలను రూ. 30లకు పెంచింది. కేంద్రం మాత్రం రైస్ మిల్లర్లపై కనికరం చూపించడం లేదు. పూర్తి స్ధాయిలో లెవీ ఎత్తివేయడం వల్ల తెలంగాణ రైస్ మిల్లులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. 
-రైస్‌మిల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి 
జుగల్ కిషోర్ ఖండేల్‌వాల్ 
నాట్యమయూరి 
డా. 
కూచిపూడిలో రాణిస్తున్న గూడెం కళాకారిణి
11ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ప్రతిభలు.. పురస్కారాలు...
డాక్టరేట్‌తో సత్కరించిన సౌత్‌ఆఫ్రికాలోని 
మాలే దేశం 
దూరదర్శన్‌లో గ్రేడ్ వన్ గుర్తింపు..
కొత్తగూడెం మనసు పరవశిస్తుంది.. వేస్తే తనువు పులకిస్తుంది.. కూచిపూడి, పేరిణీలాస్యం, భరతనాట్యం లాంటి నృత ప్రపంచంలో తెచ్చుకుంది. .తెలుగు రాష్ట్రలనుంచే కాకుండా రాష్ర్టాలు, దేశాలకు వెళ్లి పేరు ప్రఖ్యాతలను చాటి చెపుతోంది. కూచిపూడి కళాకారిణి డాక్టర్ మదురాపంతుల సీతాప్రసాద్. కొత్తగూడెం రైటర్‌బస్తీలో నివాసముంటున్న సీతాప్రసాద్ సింగరేణి అధికారి భార్య. గోదావరిఖనిలో తన భర్త ఉద్యోగం చేసినపుడు పేరిణిలాస్యం డ్యాన్స్ నేర్యుకుని చిన్నచిన్నగా కళారంగంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత నాట్యంపై పట్టు సాధించి కూచిపూడిలో డిప్లమో చేసి డ్యాన్స్‌ర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత కొత్తగూడెం బదిలీపై వచ్చాక శ్రీదుర్గసాయి నృత్యనికేతన్ డ్యాన్స్ అకాడమి ఏర్పాటు చేసి సుమారు 250 మంది విద్యార్థులకు డ్యాన్స్‌నేర్పి వారిని నాట్యమయూరాలుగా తీర్చిదిద్దింది. కేవలం డ్యాన్స్‌లు నేర్పడమే కాదు.., జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి డ్యాన్స్ పోటీల్లో పాల్గొని పేరు ప్రఖ్యాతలను జాతీయస్థాయిలో చాటిచెపుతూ శెభాష్ అనిపించుకుంటుంది. సీతాప్రసాద్. నాడు కూచిపూడి డ్యాన్స్‌ర్ ఉన్న సీతాప్రసాద్ నేడు డాక్టర్ సీతాప్రసాద్‌గా మారిపోయింది.
11ఏళ్ల ప్రస్థానంలో ప్రతిభలు, పురస్కారాలు.. 
సీతాప్రసాద్ ప్రస్థానం ఈనాటిది కాదు. సుమారు పదకొండేళ్ల ప్రస్థానం. తొలిసారిగా కరీంనగర్ జిల్లాలో జిల్లాస్థాయిలో పేరుతెచ్చుకున్న తను, కొత్తగూడెంలో బాలోత్సవ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అదే ఆమె నాట్యానికి బీజం వేసింది. ఆ తర్వాత రాష్ట్రస్థాయి యూత్‌ఫెస్టివల్ వారు నిర్వహించిన స్టేట్‌మీట్‌లో రవీంద్రభారతిలో నాట్యం చేసి రాష్ట్రస్థాయిలో ఎంపికయ్యారు. ఆ తర్వాత లక్నో, ఉత్తరప్రదేశ్‌లలో జాతీయ స్థాయి పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పేరిణిలాస్యం వరంగల్ వేయిస్తంభాల గుడి వద్ద వేసి పొందారు. కేరళలో జరిగిన జాతీయ స్థాయి ఉత్సవాల్లో పాల్గొని అవార్డులు సొంతం చేసుకున్నారు. ఒకటేంటి చెన్నై, రాష్ర్టాల్లో పదర్శనలిచ్చారు.
రాష్ట్రస్థాయి బాలోత్సవ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సీతాప్రసాద్ 2013లో సిడ్నీలో తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్యాన్స్ పోటీల్లో ప్రతిభ కనబరిచినందుకు అక్కడ నిర్వహకులు సన్మానం చేశారు. అదే సంవత్సరం యూనివర్శిటీ ఆఫ్ వరల్డ్ ఎకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ ఆధ్వర్యంలో సౌత్‌ఆఫ్రికాలో మాలే దేశం అధ్యక్షుడు ద్వారా డాక్టరేట్‌ను పురష్కారం చేశారు. ఉమెన్స్‌డే సందర్బంగా జస్టీస్ రోహిణి ద్వారా అవార్డును ఆమె చేతులు మీదుగా అందుకున్నారు. అదే ఏడాది జూనియర్ చాంబర్ ఇంటర్‌నేషనల్ ఔట్ స్టాండింగ్ యంగ్ పర్సన్ అవార్డును మధురైలో జాతీయస్థాయి అవార్డును సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత భద్రాద్రి కళాభారతి ద్వారా ఉగాది పురష్కారాన్ని అందుకున్నారు. అదే ఏడాది రవీంద్రభారతిలో ప్రముఖ రచయిత, దర్శకుడు కె. చేతులుమీదుగా ఉగాది పురష్కారం అందుకున్నారు. ఇంత గుర్తింపు పొందిన తనను దూరదర్శన్ కూడా ఏ గ్రేడ్ ఆర్టిస్టుగా గుర్తింపు ఇస్తూ సర్టిఫికెట్‌ను ఇచ్చింది.
 
No comments:
Post a Comment