ఈనెల 4,5న విజయవాడలో సైకాలజిస్ట్‌ల జాతీయ మహాసభలు
ఖమ్మం చర్చ్‌కాంపౌండ్, జూన్ 1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో హోటల్ ఐలాపురంలో ఈనెల 4, 5తేదీల ల్లో సైకాలజిస్ట్‌ల జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నామని ప్రొగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఖమ్మం జిల్లా కన్వీనర్ కొత్తపల్లి రాంచందర్‌రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు రాష్ర్టాలతో పాటు ఒరిస్సా, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ తదితర రాష్ర్టాల నుంచి ప్రతినిధులు, సైకాలజిస్ట్‌లు వృత్తి పరంగా నైపుణ్యాలను పెంపొందించుకునేందేకు నిష్ణాతులైన వారిచే శిక్షణ కార్యక్రమాలు ఈ మహాసభలలో నిర్వహిస్తున్నామన్నారు. వృత్తి పరంగా ఎటువంటి గుర్తింపు లేకుండా, భద్రతకు నోచుకోకుండా దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్న సైకాలజీ రంగ అవసరాన్ని ప్రభుత్వాలకు తెలియజెప్పేందుకు జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ జాతీయ మహాసభలలో వివిధ రాష్ర్టాలకు చెందిన వేలాది మంది సైకాలజిస్టులు పాల్గొంటారన్నారు. మానసిక ఆరోగ్యం, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్‌ల పాత్ర అనే అంశంపై ఇండియన్ సైకియాట్రిక్, సొసైటీ పూర్వ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, మనో లైంగిక సమస్యలు- కౌన్సిలింగ్‌తో నివారణ అనే అంశంపై ప్రఖ్యాత లైంగిక వైద్య నిపుణులు డాక్టర్ జీ సమరం, కాగ్నెటివ్ బిహేవియర్ థెరఫీ అనే అంశంపై క్లీనికల్ సైకాలజిస్ట్ ప్రొఫెసర్ కే.నిరంజన్‌రెడ్డి, హిప్నో కమలాకర్ తదితరులచే ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహిస్తామన్నారు. సైకాలజీలో మాస్టర్ డిగ్రీ, డిప్లొమా చేసిన వారు, చేస్తున్న విద్యార్థులు కూడా ఈ మహాసభలలో నిర్వహించే ప్రత్యేక వర్క్‌షాప్‌లో పాల్గొనే అవకాశమిస్తామన్నారు. ఆసక్తి కలిగిన వారు 9949927793 నెంబర్‌లో సంప్రదించాలని ఆయన కోరారు
No comments:
Post a Comment