మయూరి సెంటర్, జూన్ 2 : తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉద్యమకారులకు, అమరులకు అంకితమని వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. గురువారం నగరంలోని నిజాంపేట 28వ డివిజన్ రాతి దర్వాజలో టీఆర్‌ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటుకు సీఎం కేసీఆర్ చేసిన కృషి, అకుంటిత దీక్ష చిరస్థాయుగా నిలిచిపోతుందన్నారు. పేదలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి అభ్యున్నతికి బాటలు వేస్తున్నారని, గడచిన రెండేళ్ల కాలంలోనే స్పష్టమైందన్నారు.
ఈ సందర్భంగా 1969 తొలి ఉద్యమకారులు అన్నాబత్తుల రవీందర్ పోరాట పటిమను స్మరించుకున్నారు. ఉద్యమకారుల కుటుంబాలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కమర్తపు మురళి, బీజీ ైక్లెమెంట్, నాయకులు అర్వపల్లి సుధాకర్, పొదిల వెంకటేశ్వర్లు, మజీద్, ముజాహీద్,ముక్తార్, దాదే భాస్కర్, పాకాలపాటి శేశగిరి , నయీం, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
No comments:
Post a Comment