Saturday, 4 June 2016

4వేల రైతు జలనిధి నిర్మాణాల లక్ష్యం


  -డ్వామా పీడీ జగత్‌కుమార్‌రెడ్డి
అశ్వారావుపేట టౌన్, జూన్ 4: భూగర్భ జలా లు పెంచేందుకు, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉపాధి పథకంలో జిల్లాలో రైతుల పొలాల్లో 4వేల రైతు జలనిధి కుంటలు నిర్మించే లక్ష్యంగా పనిచేస్తున్నామని డ్వామా పీడీ జగత్‌కుమార్‌రెడ్డి అన్నారు. స్థానిక ఉపాధి హామీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఫారంఫాండ్‌ల నిర్మాణాలకు అశ్వారావుపేట నియోజకవర్గం అనుకూలంగా ఉందని, గిరిజనుల భూముల్లో నిర్మాణాలు చేపట్టేందుకు ప్రత్యేక కృషిచేస్తున్నట్లు తెలిపారు. అవసరమైతే పదివేల వరకైనా నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇంటింటికీ, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు పాఠశాలల్లో ఇంకుడు గుంతలను నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. 

హరితహారం లో భాగంగా చెరువు గట్లపై 25 లక్షల టేకు మొక్కలను, వాగులు, వంకల సమీపంలో ఈతచెట్ల పెంపకం చేపట్టేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రతీ ఇంటికి ఐదు వరకు పం డ్ల మొక్కలను అందించ నున్నామని తెలిపారు. ఉపాధి కూలీలకు వేతనాలు చెల్లింపుల్లో నిర్లక్ష్యం గా వ్యవహరిస్తే కటిన చర్యలు తీసుకుంటామన్నా రు. ఏరోజు డబ్బులు ఆరోజే పంపిణీ చేయాలన్నా రు. ఉపాధి కూలీలకు జిల్లా మొత్తం 28వేల షెడ్ నెట్‌లు అవసరముంగా, ప్రస్తుతం 5 వేలు అందుబాటులో ఉన్నాయని త్వరాలోనే అందజేస్తామన్నారు. జిల్లాలో 2 వేల ఎకరాల్లో పండ్లతోటలు పెంచేందుకు అనుమతులు వచ్చాయని, 1400 ఎకరాల్లో పనులు చేపట్టినట్లు స్పష్టం చేశారు. ఏపీవో కిలపర్తి రామచంద్రరావు ఉన్నారు. 

పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
రైతుల అభివృద్ధికోసం ప్రభుత్వ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని డ్వామా పీడీ పీ జగత్‌కుమార్‌రెడ్డి సూచించారు. అల్లిగూడెం, అచ్చుతాపురం, నారంవారిగూడెం గ్రామాల్లోని రైతుల పంటపొలాల్లో నిర్మిస్తున్న రైతుజలనిధి పనులను శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఈ ఫారంఫాండ్ నిర్మాణాల ద్వారా ఉపాధి కూలీలు ఉపాధి పొందాలన్నారు. సిబ్బంది తగిన విధంగా ప్రోత్సహించాలని తెలిపారు. ఫారంఫాండ్ నిర్మాణాలపై రైతులకు అవగాహనలు కల్పించాలని ఈజీఎస్ సిబ్బందికి సూచించారు.

No comments:

Post a Comment