Friday, 3 June 2016

రైతేరాజు పదానికి నిదర్శనమే రామారావు

 రఘునాథపాలెం, జూన్ 2: రైతే రాజు అనే నానుడిని అక్షరాల నిజం చేసేలా కోయచలక గ్రామానికి చెందిన చెరుకూరి రామారావు వ్యవసాయం చేస్తున్నాడని, రామరావును ఆదర్శంగా తీసుకొని వ్యవసాయంలో రాణించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా రైతాంగానికి సూచించారు. గురువారం రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా కూరగాయలు సాగులో రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్న కోయచలక గ్రామానికి చెందిన చెరుకూరి రామరావు కూరగాయల పంటలను మంత్రి పరిశీలించారు. సుమారు గం టపాటు పొలంలో పర్యటించి రామారావు కూరగాయల సాగు లో పాటించే మెలకువలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నా రు. 

మల్చింగ్, డ్రిప్ పద్దతిలో రామారావు తీసుకునే పద్దతుల ను గమనించారు. అ ధికారులు సైతం రా మారావు కూరగాయ ల సాగులో తీసుకునే జాగ్రత్తలు, ఆయన ని ర్దేశించుకున్న లక్ష్యాన్ని మంత్రికి వివరించారు. ఈసందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ జిల్లాలో 15శాతం కూరగాయలు మాత్రమే సాగవుతున్నాయని, 85శాతం ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశా రు. ఈవిధానానికి స్వస్తి చెప్పే విధంగా అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో ఉన్న రైతులు కూరగాయల పంటలను సాగుచేసే విధంగా అధికారులు అవగాహన సదస్సులు చేపట్టాలన్నారు. రెండెకరాలతో కూరగాయలను సాగును చేపట్టిన కోయచలకకు చెందిన రైతు చెరుకూరి రామారావు ప్రస్తుతం 20ఎకరాల ఆసామిగా మారాడంటే కూరగాయల పంట ఎంత లాభాలను గడిస్తున్నాయో అర్ధం చేసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగం కన్నా వ్యవసాయమే మిన్న అనే విధంగా భవిష్యత్ ఉండబోతుందన్నా రు.

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా చేపట్టే పథకాలు మంచి దిగ్విజయాన్ని సాధిస్తాయనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. గోదావరి జలాలను జిల్లాలోని ప్రతి ఎకరాలనికీ తీసుకవచ్చి రైతు జీవితాల్లో కొత్త వెలుగులు చూ డాలనేది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. కార్యక్రమం లో డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, జేడీఏ మణిమాల, హార్టికల్చర్ డీడీ శ్రీనివాసరావు, ఏడిఏ కొంగర వెంకటేశ్వర్లు, ఎంపీడీవో శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరా వు, కొండబాల కోటేశ్వరరావు, నల్లమల వెంకటేశ్వర్లు, సుధాకర్, ఖమ్మం నియోజకవర్గ ఇంచార్జ్ ఆర్జేసీ కృష్ణ, ఎంపీపీ మాళోతు శాంత, జెడ్పీటీసీ వీరూనాయక్, మండల పార్టీ అద్యక్షుడు మద్దినేని వెంకటరమణ, సాదు రమేష్‌రెడ్డి, మెంటెం రామారావు, గ్రామ సర్పంచ్ మేళ్లచెరువు రాంప్రసాద్, మాదంశెట్టి హరిప్రసాద్, వడ్డే ప్రసాద్, చెరుకూరి పూర్ణ, నున్నా శ్రీనివాసారావు, తోట వెంకట్, మేళ్లచెర్వు రమేష్, పంతంగి వెంకటేశ్వర్లు, దేవేందర్, మంచుకొండ సైదులు, పాల్గొన్నారు.

No comments:

Post a Comment