ఖమ్మం చర్చ్‌కాంపౌండ్, జూన్ 2: టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకురాలు నెల్లూరి షర్మిలా సంపత్‌ను ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం పరామర్శించారు. షర్మిలా సంపత్ భర్త సంపత్‌కుమార్ గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. సంపత్‌కుమార్ చిత్రపటానికి ఎంపీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. షర్మిలా సంపత్ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని, ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. ఎంపీ పొంగులేటి వెంట నాయకులు బోర్రా రాజశేఖర్, జయపాల్, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment