Friday, 3 June 2016

సీఎం నాయకత్వంలో బంగారుతెలంగాణ నిర్మించుకుందాం

  ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కారేపల్లి, జూన్ 2 : సీఎం కేసీఆర్ నాయకత్వంలో పోరాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా నిర్మించుకుందామని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో గురువారం ఆపార్టీ నాయకుడు ఇమ్మడి తిరుపతిరావు అధ్యక్షతన ఉద్యమకారుల సన్మాన సభను ఏర్పాటు చేశారు. స్థానిక సినిమాహాల్‌సెంటర్‌లో మహిళలు బతుకమ్మలు, బోనాలతో పెద్ద ఎత్తున తరలివచ్చి ఎంపీకీ ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి కాలినడకన వచ్చిన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బస్టాండ్ సెంటర్లోని తెలంగాణతల్లి విగ్రహావిష్కరణ చేశారు.

అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. అరవై ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నెరవేరిందన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉందని గుర్తుకు చేశారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలు చారిత్రాత్మకమన్నారు. జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నాయకత్వంలో ఖమ్మం జిల్లాను రాష్ట్రంలోనే అభివృద్ధిలో ముందుంటుందన్నారు. అంతకు ముందు అమరవీరులకు నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన కొంత మంది ఉద్యమకారులను ఎంపీ పొంగులేటి ఘనంగా సన్మినించారు. ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎత్తివేపించేందుకు తమవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో బొర్రా రాజశేఖర్, జడల వెంకటేశ్వర్లు, బానోచ్ దేవ్లానాయక్, ఎంపీపీ బానోత్ పద్మావతి, జడ్పీటీసీ ఉన్నం వీరేందర్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్ష, కార్యధర్శులు రావూరి శ్రీనివాసరావు, అడ్డగోడ ఐలయ్య, బాజుమల్లాయిగూడెం సర్పంచ్ గుగులోత్ సుజాత, ఎంపీటీసీలు ఇమ్మడి రమాదేవి, ఈశ్వరీనందరాజ్, బోడా కృష్ణవేణి, గణపారపు పద్మ పాల్గొన్నారు.

No comments:

Post a Comment