Friday, 3 June 2016

మసీదులో బోరు ప్రారంభించిన ఎమ్మెల్యే అజయ్

  మయూరిసెంటర్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించకుని నగరంలోని 24వ డివిజన్‌లోగల మజీద్ ఏ ఫీర్దోస్ మసీదులో సీడీపీ నిధుల నుంచి మంజూరు చేసిన బోరును ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ గురువారం ప్రారంభించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మనోహర్ ఇంతియాజ్, హబీబ్, జానీ, అక్బర్, మీరాసాహెబ్, హకీం, ముఖ్తార్, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం బైపాస్ రోడ్‌లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు.

ఈసందర్భంగా ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, జడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవితలు మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, రాతి ధర్వాజ, గాంధీచౌక్ ప్రాంతాలలో పువ్వాడ అజయ్ జాతీయ జెండాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మందడపు మనోహర్, రుద్రగాని శ్రీదేవి, పాలడుగు పాపారావు, జాన్‌బీ, కోటి, చావా నారాయణరావు, నాయకులు పాలకుర్తి నాగేశ్వరరావు, బచ్చు విజయ్, ప్రసాద్, ఉపేందర్, మద్దినేని వెంకటరమణ, దేవదానం, పద్మ, భూక్యా భాషా తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment