ఖమ్మం క్రైం, జూన్ 2 : జలమే మానవాళికి జీవనాధారమని, అంతరించిపోతున్న భూగర్భ జలాలను పరిరక్షించుకునేందుకు ఇంకుడు గుంతలు అవసరమని ఎస్పీ షాన్వాజ్ ఖాసీం అన్నారు. గురువారం పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ఆవరణలోని పలు చోట్ల ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇంకిన నీరే ప్రధాన ఆధారమని తెలుసుకుంటూ అందరూ సామాజిక బాధ్యతగా తీసుకుని వర్షపునీరును బావులు, కుంటల్లోకి మళ్లించి భూగర్భ జలమట్టం పెరిగేందుకు దోహదపడాలన్నారు.
జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయిక్రిష్ణ, డీఎస్పీలు అశోక్‌కుమార్, సాయిశ్రీ, సంజీవ్, మాణిక్‌రాజ్, ఆర్‌ఐలు జార్జ్, విజయబాబు, పోలీస్ అసోసియేష్ అధ్యక్షుడు శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
44
No comments:
Post a Comment