Friday, 3 June 2016

భద్రాచల దేవస్థానం ఈవో జ్యోతి పదోన్నతిపై బదిలీ

  ద్రాచలం, నమస్తే తెలంగాణ జూన్1: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈవోగా పనిచేసిన కూరాకుల జ్యోతి అడిషనల్ కమిషనర్ ఎండోమెంట్ ట్రిబ్యునల్‌గా పదోన్నతిపై బదిలీ అయ్యారు. ఈమె స్థానంలో నూతన ఈవోగా టీ.రమేష్‌బాబుకు ప్రభుత్వం భద్రాచలం దేవస్థానం ఈవో బాధ్యతలు అప్పగించింది. కూరాకుల జ్యోతి 2014 సెప్టెంబర్26వ తేదీన ఈవోగా బాధ్యతలు చేపట్టారు. గతంలో 2014లో మూడు నెలలపాటు రమేష్‌బాబు ఈవోగా పనిచేసిన అనుభవం ఉంది. తిరిగి అతన్నే ప్రభుత్వం ఈవోగా నియమించింది. అదేవిధంగా రామాలయంలో పరిచారకులుగా పనిచేస్తున్న ముగ్గురికి అర్చకులుగా పదోన్నతి లభించింది. కారంపూడి కిరణ్‌కుమార్, కోటి విష్ణువర్ధనాచార్యులు, పొడిచేటి రామభద్రాచార్యులకు అర్చకులుగా పదోన్నతి కల్పిస్తూ ఈవో జ్యోతి ఉత్తర్వులు విడుదల చేశారు

No comments:

Post a Comment