Friday, 3 June 2016

జిల్లా పోలీసులకు మెడల్స్ ప్రదానం

  ఖమ్మం క్రైం, జూన్2: జిల్లా పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ ప్రతిభ కనబర్చిన పోలీస్ అధికారులకు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గురువారం సికింద్రాబాద్‌లోని పోలీస్ పరేడ్‌గ్రౌండ్స్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మెడల్స్‌ను ప్రదానం చేశారు. తీవ్రవాద కార్యకలాపాల నింయత్రణలో చురుగ్గా పాల్గొని,మావోయిస్టు చర్యలకు అడ్డుకట్ట వేసి ఉత్తమ ప్రతిభ కనబర్చిన రిజర్వుడ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ యస్.నాగేశ్వరరావుకు ముఖ్యమంత్రి శౌర్యపతకం,లా అండ్‌ఆర్డర్, జిల్లా స్పెషల్ బ్రాంచ్‌లో పని చేసి పదవీ విరమణ పొందిన విశ్రాంత ఎస్సై రుద్ర వెంకటనారాయణకు మహోన్నత సేవాపతకం, ఖమ్మం రైల్వే పోలీస్‌స్టేషన్ (జీఆర్‌పీ) సీఐ స్వామి శౌర్య పతకం అందుకున్నారు.ప్రతిష్టాత్మకమైన మెడల్స్‌ను అందుకున్నందుకు వారికి పోలీసు అధికారులు,సిబ్బంది అభినందనలు తెలిపారు.

No comments:

Post a Comment