ఖమ్మం సిటీ, జూన్ 2: సీఎం కేసీఆర్ ఆకాంక్ష బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వా ములు కావాలని జడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత పిలుపునిచ్చారు. జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో పటేల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలను ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించా రు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చారిత్రకమన్నారు. స్వరాష్ట్రంలో ఉధ్యమనేత కేసీఆర్ సీఎం కావటం అన్నివర్గాల ప్రజల అదృష్టమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే సబ్భండ వర్ణాల బతుకుల్లో మార్పులు వచ్చాయన్నారు.
ఉద్యోగులు చిత్తశుధ్దితో పనిచేస్తూ ప్రభుత్వ పథకాలను విజయవంతం చేసేందుకు చిత్తశుద్దితో పనిచేయాలని కోరారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణంలో పాలు పంచుకోవాలన్నారు. మీనా నృత్యాలయం కళాకారులచే స్వాగత నృత్యం, వీరు నాయక్ బృందం పేరిణి నృత్యం, చిన్నారులచే శాస్త్రీయ నృత్యాలు, జానపద గేయాలు, మిమిక్రీ, జానపద నృత్యాలు, కుర్నవల్లి పాఠశాల విద్యార్థులు శిరీష ద్వయంచే నేత్రావధానం, కోయ డ్యాన్సులు, హాస్యవల్లరి, సాంస్కృతిక సారథి కళాకారులచే ప్రదర్శనలు, గిరిజన జానపద నృత్యాలు ప్రదర్శించారు.
ఈ సందర్భంగా బాణా సంచాను పెద్ద ఎత్తున పేల్చారు. ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి స్టేడియం వరకు మెప్మా ఆధ్వర్యంలో కొవొత్తులతో ర్యాలీ నిర్వహించారు, మహిళలతో కలిసి గడిపల్లి కవిత నృత్యం చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ డీ.ఎస్ లోకేష్‌కుమార్, ఖమ్మం డిప్యూటి మేయర్ బత్తుల మురళిప్రసాద్, ఏజేసి శివశ్రీనివాస్, డీఆర్‌ఓ శ్రీనివాస్, జడ్పీ సీఈఓ నగేష్, టీఆర్‌ఎస్ నాయకులు బేగ్, కొండబాల కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
ప్రజలను ఆకట్టుకున్న కళాకారుల ర్యాలీ...
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన సాంస్రృతిక కార్యక్రమాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకు న్నాయి. ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, ఇల్లెందు, పాల్వంచ తదితర పట్టణాలలో జ రిగిన సంబురాలలో ప్రజలు అధిక సంఖ్య లో పాల్గొన్నారు. జిల్లాలోని ప్రధాన పట్ట ణాలలో తెలంగాణ సంబురాలు అంబరా న్నంటాయి. తెలంగాణ సంస్కృతి ఉట్టి పడే లా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించా రు. సమాచార, పౌరసంబంధాల శాఖ ఆ ధ్వర్యంలో గురువారం సాయంత్రం నగరం లోని అమరవీరుల స్థూపం నుంచి ఇల్లెందు రోడ్‌లోని సర్ధార్ పటేల్ స్టేడియం వరకు కళాకారులచే ర్యాలీ నిర్వహించారు. తొలుత సమాచార శాఖ ఏడీ మహ్మద్ మూర్తుజా జెండా ఊపి కళాకారుల ర్యాలీని ప్రారంభిం చారు. అనంతరం ర్యాలీ బస్టాండ్ సెంటర్, వైరా రోడ్డు, ఇల్లెందు క్రాస్ రోడ్డు మీదుగా పటేల్ స్టేడియంకు చేరుకుంది. ఈ ర్యాలీలో డప్పు, కోలాటం, లంబాడా, రాజన్నడోలు, చెక్క భజన, బైండ్ల కథ, పల్లె సు ద్దులు, చిందు యక్షగానం, ఒగ్గు కథ, బుర్ర కథ ప్రదర్శనలు చేస్తూ కళాకారులు ర్యాలీలో పాల్గొన్నారు. వీరితో పాటు కో యదొర, పిట్టల దొర వేషాధారణలు, ఇంద్రజాల ప్రదర్శనలు చేస్తూ ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో సమాచార శాఖ ఏడీతో పాటు ఆ శాఖ ఉద్యోగులు దశరథం, శీలం శ్రీనివాస్ తదిత రులు నృత్యాలు చేశారు.
No comments:
Post a Comment