Friday, 3 June 2016

అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు

 నేడు మంత్రి తుమ్మల చేతుల మీదుగా
-నియామక పత్రాల అందజేత
ఖమ్మం సిటీ, 1: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థిక సహాయం అందించడంతో పాటు వారి కుటుంబంలో అర్హత కలిగిన ఒకరి ఉద్యోగం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ఏడుగురు అమరవీరుల్లో ఆరుగురి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలను ఇవ్వనున్నారు. ఆవిర్భావ వేడుకల్లో మంత్రి తుమ్మల చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాలను అందించనున్నారు. వరంగల్ జిల్లా మరిపెడ మండలానికి చెందిన అమరవీరుడు జర్పుల సురేష్ తమ్ముడు జర్పుల సంతోష్‌కు జూనియర్ అసిస్టెంట్, వరంగల్ జిల్లా మరిపెడ మండలానికి చెందిన అమరవీరుడు మేన వేణు తమ్ముడు నవీన్‌కు జూనియర్ అసిస్టెంట్, గార్లకు చెందిన అమరవీరుడు కళా ప్రకాష్‌కుమార్‌జైన్ తమ్ముడు కుమారుడైన కళా విపుల్ కుమార్‌జైన్‌కు జూనియర్ అసిస్టెంట్, 1969 ఉద్యమకారుడు, అమరవీరుడైన అన్నాబత్తుల రవీంద్రనాథ్ కోడలు చిత్తజల్లు సత్యప్రియకు జూనియర్ అసిస్టెంట్, ఖమ్మం నగరానికి చెందిన అమవీరుడు షేక్ మహమూద్ పాషా కుమారుడైన షేక్ ఖాజామొహినుద్దీన్‌కు జూనియర్ అసిస్టెంట్, ఖమ్మం నగరానికి చెందిన అమరవీరుడు వెంపటి రామకృష్ణ అక్క పాటి నాగమణికి అటెండర్ ఉద్యోగాలకు ఎంపిక చేశారు. వీరందరికి గురువార పరేడ్‌గ్రౌండ్‌లో ఉద్యోగ నియామక పత్రాలను అందించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి బీ శ్రీనివాస్ వెల్లడించారు.

No comments:

Post a Comment