పొంగులేటి ఉచిత కోచింగ్ అభినందనీయం...
-జిల్లాలో 1500 పేద విద్యార్థులకు ఆసరా..
-రైట్ ఛాయిస్ కోచింగ్ నాణ్యతకు మారుపేరు
-ఉచిత కోచింగ్ పోస్టర్ ఆవిష్కరించిన నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి
ఖమ్మం ఎడ్యుకేషన్, జూన్ 1 : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లాలో 1500 మంది ఎస్.ఐ, కానిస్టేబుల్స్ అభ్యర్థులకు రైట్ ఛాయిస్ ఐఏఎస్ అకాడమీ సహకారంతో ఎంపీ పొంగులేటి ఉచిత కోచింగ్ ఇప్పించాలని నిర్ణయించడంపై నమస్తే తెలంగాణా ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్ లోని నమస్తే తెలంగాణా కేంద్ర కార్యాలయంలో ఉచిత కోచింగ్‌కు సంబంధించిన పోస్టర్ రైట్ చాయిస్ చైర్మన్ మెండెం కిరణ్ ఆధ్వర్యంలో కట్టా ఆవిష్కరించారు.
ఎంపీ పొంగులేటి తీసుకున్న నిర్ణయంతో సుమారు 1500 మంది పేద విద్యార్థులకు సరైన కోచింగ్ అంది.. వాళ్లు జీవితంలో నిలదొక్కుకొనేందుకు ఉపయోగపడుతుందని కట్టా శేఖర్‌రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఎంతో మంది పేద విద్యార్థులు కోచింగ్ తీసుకొనే స్తోమత లేక ప్రభుత్వ ఉద్యోగాలకు దూరం అవుతున్నారని.. ఈ విషయాన్ని గమనించిన పొంగులేటి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో ఒకేసారి ఇంతమందికి ఉచిత కోచింగ్ ఇప్పిస్తున్న ఏకైక ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావడం విశేషమన్నారు. ఖమ్మం జిల్లాలో నాణ్యమైన కోచింగ్‌కు మారుపేరుగా రైట్ ఛాయిస్ నిలిచిందని..స్థాపించిన కొద్ది కాలంలోనే జిల్లా విద్యార్థుల అభిమానాన్ని చూరగొని..సంచలన ఫలితాలు నమోదు చేసిందని ఆనందం వ్యక్తం చేశారు. పటిష్టమైన ప్రణాళిక, రాష్ట్రంలోనే అత్యుత్తమ ఫ్యాకల్టీ, నాణ్యమైన స్టడీ మెటీరియల్ సహాయంతో విద్యార్థులకు నాణ్యమైన కోచింగ్ రైట్ ఛాయిస్ అందిస్తోందని కట్టా శేఖర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ.. ఈ రెండు నెలల కాలంలో కూడా ఎక్కువ మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించేలా చూడాలని కట్టా సూచించారు. ఈ కార్యక్రమంలో రైట్ ఛాయిస్ చైర్మన్ కిరణ్‌కుమార్‌తో పాటు, నెట్‌వర్క్ ఇన్‌చార్జ్ మార్కండేయ, అసిస్టెంట్ ఎడిటర్ కృష్ణమూర్తి పాల్గొన్నారు.
No comments:
Post a Comment