ఇంగ్లిష్ మీడియం గురుకులాన్ని సందర్శించిన ఎమ్మెల్యే
కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, మే 31: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఇంగ్లిష్ మీడియంలో మైనార్టీ(అల్పసంఖ్యాకుల) గురుకుల పాఠశాలలను ప్రారంభించి ఒక్కొక్క విద్యార్థినిపై ఏడాదికి రూ.80 వేలు ఖర్చు చేసి సకల సౌకర్యాలు కల్పించి విద్యను అందించాలని సంకల్పించిందని, ఇందులో భాగంగా కొత్తగూడెంలో నెలకొల్పిన మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలను మైనార్టీలు సద్వినియోగం చేసుకోవాలని కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు సూచించారు.
మంగళవారం సుభాష్‌చంద్రబోస్ నగర్ గోధుమవాగు(రామవరం) సమీపంలో అద్దె భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మైనార్టీ గురుకుల బాలికల హైస్కూల్‌ను సందర్శించారు. ప్రిన్సిపల్ వీరభద్రంతో పాఠశాల అడ్మీషన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, సౌకర్యాలన్నీ కల్పించాలని సూచించారు. ఇంగ్లీష్ మీడియంలో ఉత్తమ బోధన అందించేందుకు అవసరమైన ప్రమాణాలను పాటించాలన్నారు. త్వరలోనే మైనార్టీ బాలికల గురుకుల ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌కు పక్కా భవనాన్ని కొత్తగూడెంలోనే నిర్మింపజేస్తామన్నారు.కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, మే 31: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఇంగ్లిష్ మీడియంలో మైనార్టీ(అల్పసంఖ్యాకుల) గురుకుల పాఠశాలలను ప్రారంభించి ఒక్కొక్క విద్యార్థినిపై ఏడాదికి రూ.80 వేలు ఖర్చు చేసి సకల సౌకర్యాలు కల్పించి విద్యను అందించాలని సంకల్పించిందని, ఇందులో భాగంగా కొత్తగూడెంలో నెలకొల్పిన మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలను మైనార్టీలు సద్వినియోగం చేసుకోవాలని కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు సూచించారు.
మంగళవారం సుభాష్‌చంద్రబోస్ నగర్ గోధుమవాగు(రామవరం) సమీపంలో అద్దె భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మైనార్టీ గురుకుల బాలికల హైస్కూల్‌ను సందర్శించారు. ప్రిన్సిపల్ వీరభద్రంతో పాఠశాల అడ్మీషన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, సౌకర్యాలన్నీ కల్పించాలని సూచించారు. ఇంగ్లీష్ మీడియంలో ఉత్తమ బోధన అందించేందుకు అవసరమైన ప్రమాణాలను పాటించాలన్నారు. త్వరలోనే మైనార్టీ బాలికల గురుకుల ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌కు పక్కా భవనాన్ని కొత్తగూడెంలోనే నిర్మింపజేస్తామన్నారు.
No comments:
Post a Comment