కేసీఆర్ సార్‌కు రుణపడి ఉంటాం
గార్ల, మే 31 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రధాత, రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్‌కు మేము తుది స్వాస విడిచేంత వరకు రణపడి ఉంటామని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నాడు జరుగుతున్న ఉద్యమాలలో సజీవంగా ఆత్మ బలిదానం చేసుకున్న మా పెద్ద నాన్న తెలంగాణ తొలి అమరుడు కాళా ప్రకాష్ కుమార్ జైన్ మరణాన్ని గుర్తించి మా కుటుంబంలో ఉద్యోగంతో పాటు రూ. 10 లక్షలు ఆర్థిక సహాయం కల్పించారని వినోద్ కుమార్ జైన్ కుమారుడు ఉద్యోగ గ్రహీత కాళా విపుల్ కుమార్ జైన్ అన్నారు. మంగళవారం స్థానిక ఆయన నివాసంలో నమస్తేతెలంగాణతో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అమర వీరులకు కేసీఆర్ పెద్ద పీఠ వేశారని, దేశంలో మరెక్కడ కనీవిని ఎరుగని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. కేసీఆర్ కన్న బంగారు తెలంగాణ పునఃనిర్మాణంలో నా వంతు కృషి చేస్తామన్నారు
No comments:
Post a Comment