Monday, 30 May 2016

రైలు కింద పడి యువకుని ఆత్మహత్య

    మధిర, నమస్తేతెలంగాణ, మే 29 : రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మధిర పట్టణంలోని రైల్వే అండర్‌బ్రిడ్జిపై ఆదివారం చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి రైల్వే పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కృష్ణాపురం గ్రామానికి చెందిన భుక్యా వేణుగోపాల్(21) అనే వ్యక్తి మద్యానికి బానిసై జీవితంపై విరక్తి చెంది దిగువలైన్‌లో మధిర పట్టణంలోని అండర్‌బ్రిడ్జి సమీపంలో కిలోమీటర్ నెంబర్ 528/22-24 వద్ద గుర్తుతెలియని రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థ లానికి చేరుకొని మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమి త్తం మధిర ప్రభుత్వ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై రైల్వే హెడ్‌కానిస్టేబుల్ టీ.బాలస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments:

Post a Comment