Monday, 30 May 2016

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం;

    అశ్వాపురం, మే 29 : మండలంలోని మొండికుంట గ్రామం వద్ద మణుగూరు-కొత్తగూడెం ప్రధాన రహదారిలోని కల్వర్టు కింద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. మృతిచెందిన వ్యక్తి ప్రమాదవశాత్తూ మృతిచెందాడా, లేదా ఎవరైనా హత్య చేసి ఇక్కడ మృతదేహాన్ని వేశారా అని విషయం తెలియాల్సి ఉంది. కాగా మృతిచెందిన వ్యక్తి తుమ్మలచెరువు గ్రామపంచాయతీ పరిధిలోని కుర్వాపల్లికొత్తూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా వదంతులు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై పోలీసులను సంప్రదించినప్పటికి పూర్తి వివరాలు తెలియరాలేదని, విచారణ చేస్తున్నామని తెలిపారు. సీఐ సాంభరాజు సమక్షంలో ఎస్‌ఐ సంతోష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

No comments:

Post a Comment