Monday, 30 May 2016

టీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీ జడ్పీటీసీ:
   మంత్రి సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్న తోకల లత
ఖమ్మం చర్చ్‌కాంపౌండ్,/ అశ్వాపురం మే 29: టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై జిల్లాలో వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. అందులో భాగంగానే టీడీపీకి చెందిన అశ్వాపురం జడ్పీటీసీ తోకల లత ఆదివారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆమెకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్‌బీ బేగ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, నల్లమల వెంకటేశ్వరరావు, ఆర్జేసీ కృష్ణ, సాధు రమేష్‌రెడ్డి, బిచ్చాల తిరుమలరావు, అశ్వాపురం టీఆర్‌ఎస్ నాయకులు రామకృష్ణారెడ్డి, కృష్ణార్జున్, అనిల్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సాంబశివారెడ్డి పాల్గొన్నారు.
83

No comments:

Post a Comment