గాలి దుమారంతో అతలాకుతలం
-గాలి దుమారానికి ఎగిరిపోయిన రేకుల ఇండ్లు
-జిల్లావ్యాప్తంగా విరిగిపడిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
-తల్లాడలో వ్యక్తి మృతి, శివాయిగూడెంలో మహిళకు తీవ్ర గాయాలు
-అతలాకుతలమైన ఖమ్మం నగరం, లోతట్టు ప్రాంతాలు జలమయం
-మేయర్ పాపాలాల్, కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి పరామర్శ ం
రఘునాథపాలెం, మే 29 : ఆదివారం సాయంత్రం గాలి దూమారంతో కురిసిన వర్షానికి మండల ప్రజలు అతలాకుతలం అయ్యారు. వర్ష బీభత్సానికి పలు ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్ట మయ్యాయి. మమత రోడ్డు నుంచి వచ్చి శివాయిగూడెం, జింకల తండా వద్ద గుడిసెలు కట్టుకొని నివాసం ఉంటున్న పేదలు గుడిసెలు నేలమట్టమై నిరాశ్రయులయ్యారు. దీంతో గుడిసెవాసులంతా ఇల్లెందు రోడ్డెక్కి గంటపాటు ధర్నా నిర్వహించారు. మల్లేపల్లి పంచాయతీలోని రాములు తండా, బావోజీతండా, మంచుకొండ, అర్బన్ పరిధిలోని గోపాలపురం, ఎల్బీనగర్, ఖానాపురం ప్రాంతాల్లో పలు నివాసాలు కూలిపోయాయి. పలు ఇండ్లకు ఉన్న పై కప్పు లేచి వందల మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి.
ఇల్లెందు ప్రధాన రహదారిపై ఉన్న పలు చెట్లు విరిగి పడ్డాయి. మండలంలోని మంచుకొండ, అర్బన్ పరిధిలోని పాండురంగాపురం, ఎల్బీనగర్‌లో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. గోపాలపురంలో 11కేవీ విద్యుత్ వైర్లు తెగి రోడ్డుపై పడ్డాయి. 8వ డివిజన్ కార్పొరేటర్ కూరాకుల వలరాజు రెవెన్యూ సిబ్బంది రాములుతో నేలమట్టమైన ఇళ్లను పరిశీలించారు. శివాయిగూడెంలో దూబ్లే అనే వ్యక్తి ఇంటి రేకులపై చెట్లు విరిగి పడటంతో మహిళ పరిస్థితి విషమంగా మారింది. మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండతో ఉండి ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు సంభవించి తీవ్రమైన గాలులు సంభవించాయి. తీవ్రమైన గాలులు సంభవించడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు ఆగమాగం...వర్షబీభత్స
జిల్లాలో రెండోరోజు అకాల వర్షం
నేలకొరిగిన భారీ వృక్షాలు.. విరిగిపడిన విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్‌లు.. గాలికి ఎగిరిపోయిన రేకుల ఇండ్లు.. నేలరాలిన మామిడి పంట.. మట్టిలో కలిసిన కూరగాయలు.. వెరసి ప్రజల బతుకులు ఆగమాగం. ఆదివారం సాయంత్రం జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షం, చెలరేగిన గాలిదుమారం ప్రజా జీవనాన్ని అతలాకుతలం చేసింది. వరుణదేవుడికి గాలి దేవుడు జతకలవటంతో జిల్లా చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా ఆస్తి నష్టం వాటిల్లింది.

No comments:
Post a Comment