Monday, 30 May 2016

నష్టాల ఊబిలో మత్స్యకారులు ఆరేళ్లుగా ఇదే సమస్య..

  ప్రభుత్వం ఆదుకోవాలంటున్న మత్స్యకారులు
కూసుమంచి, నమస్తేతెలంగాణ : రాష్ట్రంలోనే అతిపెద్ద జలాశయంలో ఒక్కటి పాలేరు జలాశయం. కాకతీయ రాజులు నిర్మించిన ఈ జలాశయాన్ని నాటి సీఎం జలగం వెంగళరావు రిజర్యాయర్‌గా మార్చి జిల్లాకే తలమానికంగా చేశారు. 4 వేలకుపైగా విస్తీర్ణం, 2.50 లక్షల ఎకరాల ఆయకట్టు. రాష్ట్రంలోనే అతిపెద్ద మత్స్యశాఖ సొసైటీలో ఒక్కటి పాలేరు మత్స్యశాఖ సొసైటీ. మూడు జిల్లాలు, 18 గ్రామాలు, వేయ్యి కుటుంబాలు, 2వేల మంది మత్స్యకారులు జీవనం సాగించే ఏకైక మత్స్యశాఖ సొసైటీ ఇది. సుమారు 7 దేశాలకు ఇక్కడి రొయ్యలు ఎగుమతి అవుతుంటాయి. ఇంత చరిత్ర గల పాలేరు మత్స్యకారులు అభివృద్ధికి అమడదూరంలో ఉన్నారు. 60ఏళ్ల సీమాంధ్రపాలనలో పాలేరు మత్స్యకారుల సంక్షేమాభివృద్ధి గురించి పట్టించుకునే పరిస్థితి లేకుండాపోయింది. నాటి నుంచి నేటి వరకు గుత్తేదారుల చేతిలోనే ఉండిపోయింది. 

No comments:

Post a Comment