Tuesday, 31 May 2016

రెండేళ్లల్లో ఇంటింటికీ గోదారి నీళ్లు

  నాలుగు వేల కోట్లతో జిల్లాలో ఇంటింటికి తాగునీరు
-వారంలో సీతారామ ప్రాజెక్ట్‌కు టెండర్లు
-పత్తి కాకుండా లాభాసాటి పంటలు సాగు చేపట్టండి
-ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించుకోవాలి
-టేకులపల్లి మండలంలో మంత్రి తుమ్మల విస్తృత పర్యటన
టేకులపల్లి, మే 31 : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ద్వారా వచ్చే రెండెళ్లలో గోదావరి మంచినీళ్లు జిల్లాలోని ఇంటింటికి అందిస్తామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. దేశంలో మరెక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ రెండు సంవత్సరాలల్లోనే ఇంటింటికి తాగునీరు అందించేందుకు పది జిల్లాలో మొత్తం రూ.50వేల కోట్లను ఖర్చు చేస్తున్న ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. v

 రోళ్లపాడు బాలెన్స్‌డ్ రిజర్వాయర్‌గా మార్చి జిల్లాలోని 23 మండలాలకు సాగునీరు అందించే సీతారామప్రాజెక్ట్‌కు మరో వారం రోజుల్లో టెండర్లు పిలుస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో రూ.నాలుగు వేల కోట్లు లిఫ్ట్ ఇరిగేషన్‌కు, రూ.ఎనిమిది వేల కోట్లు సీతారామ ప్రాజెక్ట్‌కు మంజూరు చేసి జిల్లా సస్యశ్యామలం చేసేందుకు కంకణం కట్టుకున్నారని అన్నారు. 

No comments:

Post a Comment