Saturday, 4 June 2016

కోచ్ రేసులో సందీప్ పాటిల్

దరఖాస్తు చేసిన చీఫ్ సెలక్టర్

ముంబై: భారత క్రికెట్ జట్టు నూతన కోచ్ పదవిపై జాతీయ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఈ బాధ్యతలు చేపట్టేందుకు తన పేరును పరిశీలించాల్సిందిగా ఆయన బీసీసీఐకి దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుత చీఫ్ సెలక్టర్ పదవీకాలం ఈ సెప్టెంబర్‌లో ముగుస్తుంది. అయితే అప్పటిలోగా ముఖ్య పర్యటనల కోసం జట్ల ఎంపిక పూర్తయ్యింది కాబట్టి ఈ పదవి
కోచ్ రేసులో సందీప్ పాటిల్కి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా బీసీసీఐ ఆయనకు సూచించినట్టు సమాచారం. పాటిల్ 1996లో ఆరు నెలల స్వల్ప కాలం భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు. అలాగే 2003 ప్రపంచ కప్‌లో కెన్యా సంచలన ప్రదర్శనతో సెమీఫైనల్‌కు చేరిన సమయంలో ఆ జట్టుకు పాటిలే కోచ్‌గా ఉన్నారు.

ఒకవేళ తను కోచ్‌గా ఎంపికైతే సెప్టెంబర్‌కన్నా ముందే చీఫ్ సెలక్టర్ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. 2014లో డంకన్ ఫ్లెచర్ వైదొలిగిన అనంతరం జాతీయ జట్టు ప్రధాన కోచ్ లేకుండానే బరిలోకి దిగుతోంది. ఈ కాలంలో టీమ్ డెరైక్టర్ హోదాలో రవిశాస్త్రి దాదాపుగా కోచ్ బాధ్యతలు చేపట్టారు. ఇటీవలి టీ20 ప్రపంచకప్ వరకు ఇలాగే కొనసాగినా ఇక చీఫ్ కోచ్ నియామకం చేపట్టాలని బీసీసీఐ నిర్ణయించింది. అలాగే ఇప్పటి వరకు ఈ పదవి కోసం రవిశాస్త్రి, సంజయ్ బంగర్ కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 10 వరకు అప్లికేషన్లకు గడువుండగా పాటిల్‌కు రవిశాస్త్రి నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది.

No comments:

Post a Comment