Saturday, 4 June 2016

కేసీఆర్ రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడు

 టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క
కేసీఆర్ రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడు
 చింతకాని: కొందరు రాజకీయ దళారులు, వ్యాపారులు, కాంట్రాక్టర్లను పార్టీలోకి చేర్చుకుని.. సీఎం కేసీఆర్ రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్నాడని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఖమ్మం జిల్లా చింతకానిలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌కు దమ్ము, ధైర్యం ఉంటే రాజకీయంగా అడిగిన ప్రశ్నల
కు, ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై జరుగుతున్న అవినీతిపై సమాధానం చెప్పాలని అన్నారు.

రాష్ట్రంలో చేస్తున్న తప్పుల నుంచి తప్పించుకునేందుకే కేసీఆర్ రాజకీయ పునరేకీకరణ పేరుతో కార్యకలాపాలు చేపడుతున్నాడని తెలిపారు. జిల్లాలో మంత్రి స్థాయిలో ఉన్న రాజకీయ దళారీ, ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యాపారి, ఎంపీ స్థాయిలో ఉన్న కాంట్రాక్టర్ జిల్లా రాజకీయాలను శాసించాలని చూడటం సిగ్గుచేటని అన్నారు.

No comments:

Post a Comment