నేడు టీఆర్‌ఎస్ అభ్యర్థుల నామినేషన్
-మధ్యాహ్నం 12.04కి ముహూర్తం-హాజరు కానున్న పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
-సహకారం కోరుతూ అసద్‌తో నాయిని, ఈటల భేటీ
-ఎన్నిక ఏకగ్రీవమేనని మంత్రుల మనోగతం vv
      హైదరాబాద్, నమస్తే తెలంగాణ:రాష్ట్రం నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు జూన్ 11న జరుగనున్న ఎన్నికల కోసం తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) అభ్యర్ధులుగా మాజీ మంత్రులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ధర్మపురి శ్రీనివాస్ మంగళవారం నామినేషన్లు దాఖలు చేయనున్నట్టు ఈ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్న మంత్రుల్లో ఒకరైన రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో సోమవారం ఆయన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే సతీష్‌కుమార్, కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు శంకర్‌రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులు లక్ష్మీకాంతరావు, డీఎస్‌లు మంగళవారం ఉదయం 11 గంటల తర్వాత రాజ్యసభ నామినేషన్లు దాఖలు చేస్తారన్నారు. ఇందుకు 12.04 గంటలకు ముహూర్తం ఖరారైనట్టు తెలిసింది. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు హాజరవుతారన్నారు. తమ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న మజ్లిస్ ఎమ్మెల్యేలు కూడా తమ పార్టీ అభ్యర్ధుల నామినేషన్ పత్రాలపై సంతకాలు చేస్తారని ఈటల అన్నారు. తమపార్టీ అభ్యర్థులు తెలంగాణ సమస్యల పట్ల మంచి అవగాహన ఉన్న సీనియర్ నాయకులని పేర్కొన్నారు. కెప్టెన్ లక్ష్మీకాంతరావు 2001లో టీఆర్‌ఎస్ స్థాపించిన నాటి నుంచి తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారని, 2004లో రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారని ఆయన గుర్తు చేశారు.
 
No comments:
Post a Comment